Telangana-words

తెలంగాణా పదకోశం

  • తూటు : రంధ్రం
  • ఏతులు : గొప్పలు
  • మలుపు : మూల
  • తాపతాపకు : మాటిమాటికి
  • జల్ది : త్వరగా
  • కొత్తలు : డబ్బులు
  • ఏంచు : లెక్కించు
  • నాదాన : బలహీనం
  • నప్పతట్లోడు : పనికి మాలినవాడు
  • ల్యాగ : ఆవు దూడ
  • గుపాయించు : జొరబడు
  • కూకొ : కూర్చో
  • కూనం : గుర్తు
  • మడిగ : దుకాణం
  • పొట్లం : ప్యాకింగ్
  • బత్తీసలు : అప్పడాలు
  • పతంగి : గాలిపటం
  • సోంచాయించు : ఆలోచించు
  • పయఖాన : టాయిలెట్
  • మోసంబి : బత్తాయి
  • అంగూర్ : ద్రాక్ష
  • కష్‌కష్ : గసాలు
  • కైంచిపలంగ్ : మడత మంచం
  • చెత్రి : గొడుగు
  • కల్యామాకు : కరివేపాకు
  • మచ్చర్‌దాన్ : దోమతెర
  • మడుగుబూలు : మురుకులు
  • జమీర్‌ఖాన్ : భూస్వామి
  • జాగా : స్థలం
  • తండా : చల్లని
  • గర్మి : వేడి
  • వూకె : ఉట్టిగా
  • సిలుం : తుప్పు
  • నియ్యత్ : నిజాయితీ
  • తపాలు : గిన్నె
  • తైదలు : రాగులు
  • పలంగి : మంచము
  • బలంగ్రి : డ్రాయింగ్ రూం
  • సల్ప : నున్నని రాయి
  • దప్పడం : చారు
  • గెదుముట : పరిగెత్తించుట
  • తొక్కు : పచ్చడి
  • కిసా : జేబు
  • సల్ల : మజ్జిగ
  • అర్ర : గది
  • బుడ్డలు : పల్లీలు
  • గడెం : నాగలి
  • గాండ్లు : బండి చక్రాలు
  • కందెన : ఇంధనం
  • ఉప్పిండి : ఉప్మా
  • చిమ్ని : బుగ్గదీపం
  • తపుకు : ప్లేటు
  • ముగ్గ : చాలా
  • కందీలు : లాంతరు
  • బటువు : ఉంగరం
  • బాండ్లి : మూకుడు
  • సలాకి : అట్లకాడ
  • ఈలపీట : కత్తిపీట
  • గనుపట్ల : గడప దగ్గర
  • గుండ్లు : రాళ్ళు
  • సల్వ : చల్లదనం
  • ఏట కూర : మేక మాంసం
  • గాలిపంక : ఫ్యాను
  • షాపలు : చేపలు
  • సౌంర్త పండుగ : పుష్పాలంకరణ
  • కుమ్మరావి : కుండలబట్టి
  • లోట : డబ్బ
  • ఇడుపు : గోడంచు
  • సౌరం : క్షవరం
  • శిబ్బి : తీగల జల్లెడ
  • తూటు : రంధ్రం
  • శిరాపురి : పరమాన్నం
  • తీట : కోపం
  • పటువ : కుండ
  • తలె : పల్లెం
  • పొర్క : చీపురు
  • సపారం : పందిరి
  • సర్కార్ ముల్లు : కంపముల్లు
  • దేవులాడు : వెతుకు
  • వాగు : నది
  • సడాకు : రోడ్డు
  • చిత్పలకాయ : సీతాఫలం
  • ఏమది : ఏమిటి
  • లచ్చమ్మ : లక్ష్మమ్మ
  • రామండెం : రామాయణం
  • తక్కడి : త్రాసు
  • గంటె : చెంచా
  • కాందాని : పరువు
  • బూగ : తూనీగ
  • సందుగు : పెట్టె
  • బిటాయించు : కూర్చోమను
  • జొన్న గటుక : జొన్న గింజల అన్నం
  • కంచె : సరిహద్దు
  • లైయ్ : అతికించే పదార్థం
  • బాపు : నాన్న
  • ఆనతి : అభయం
  • సోలుపు : వరుస
  • పీనోడు : పెండ్లి కొడుకు
  • దురస్తు : బాగుచేయు
  • శిరాలు : మెడ
  • కందీలు : లాంతరు
  • ఆర్సీలు : కళ్ళజోడు
  • మక్కెండ్లు : మొక్కజొన్న
  • సుట్టాలు : బంధువులు
  • మాలస : ఎక్కువ
  • కైకిలి : కూలి
  • కొయ్‌గూర : గొంగూర
  • కూడు : అన్నం
  • అసంత : దూరంగ
  • సిబ్బి : గుల్ల
  • పావుడ : పార
  • సలమల : వేడిలో మరగడం
  • ఊకో : కాముగా ఉండు
  • జల్దిరా : తొందరగా రా
  • తపుకు : మూత
  • తువ్వాల : చేతి రుమాలు
  • లాగు : నెక్కరు
  • కాయిసు : ఇష్టం
  • బుగులు : భయం
  • ఉర్కుడు : పరుగెత్తుడు
  • శానా : చాల
  • గట్లనే : అలాగే
  • గిట్లాంటి : ఇలాంటి
  • బర్కత్ : లాభం
  • కుసో : కూర్చొండి
  • తర్జుమా : అనువాదం
  • నెరసు : చాలా చిన్నదైన
  • బకాయి : చెల్లించవలసిన మొత్తం
  • తోఫా : కానుక
  • ఇలాక : ప్రాంతం
  • బరాబరి : సరి సమానం
  • ఉసికే : ఇసుక
  • తోముట : రుద్దుట
  • గీరె : గిరక
  • బొంది : శరీరం
  • ఉలికిపడుట : అదిరిపడుట
  • ఈడు : వయసు
  • జోడు : జంట
  • కూడు : అన్నం
  • గోడు : లొల్లి
  • అల్లుట : పురి వేయుట
  • నుల్క : మంచానికి అల్లే తాడు
  • శెల్క : తెల్లభూమి
  • మొల్క : పుట్టిన మొక్క
  • శిల్క : చిలుక
  • పల్కు : మాట్లాడు
  • ఈతల : ఈవల
  • ఆతల : ఆవల
  • తను : అతడు
  • దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
  • కొట్టం : పశువుల పాక
  • గూటం : పశువుల కట్టేసే గుంజ
  • పగ్గం : తాడు
  • శాయిపత్తి : తేయాకు
  • పెంక : పెనం
  • సుంకం : పన్ను
  • లెంకు : వెతుకు
  • తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
  • తక్కెడు : ముప్పావు కిలో
  • దేవులాడు : వెతుకు
  • నడిమీలకు : మధ్యలకు
  • పుండు కోరుడు : వివాదాస్పదుడు
  • పత్యం : నియమాహారం
  • పాకులాడు : ప్రయత్నించు
  • పగిటీలి : పగటి పూట
  • పొడవూత : పొడవునా
  • పొద్దుగాల : ఉదయం
  • బరిగె : బెత్తం
  • బంజరు : ప్రభుత్వ భూమి
  • దెంకపోవుట : పారిపోవుట
  • నజీబ్ : అదృష్టం
  • మాలేస్క : ఎక్కువ
  • మతులాబ్ : విషయం
  • మనుండంగ : ప్రాణంతో ఉండగ
  • సటుక్కున : తొందరగా
  • సముదాయించుట : నచ్చ జెప్పుట
  • సైలేని : చక్కగా లేని
  • ఇకమతు : ఉపాయం
  • ఎక్క : దీపం
  • ఆలి : పెండ్లం
  • దుత్త : చిన్న మట్టి కుండ
  • ఎళ్ళింది : పోయింది
  • గైండ్ల : వాకిట్ల
  • తలగాయిండ్ల : వాకిలి ముందు
  • అంబలి : జావ
  • దప్పడం : సాంబారు, పప్పుల పులుసు
  • కుడుము : ఇడ్లీ
  • ఎసల : వండులకు ఉపయోగించే కుండ
  • నాలె : నేల
  • ఓరకు : పక్కకు
  • ఒల్లె : చీర
  • తాతిపారం : మెల్లగ
  • ఎరుక : తెలుసు
  • మొరగు : అరచు
  • అంబాడు : చిన్నపిల్లల పాకుడు
  • అర్సుకొనుట : పరామర్శించుట
  • ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం
  • ఎటమటం : అస్తవ్యస్తం
  • ఎఱ్ఱ : వానపాము
  • కూడు : అన్నం
  • చిలుక్కొయ్య : కొక్కెము
  • గులుగుట : లోలోపల మాట్లాడుట
  • గువ్వము : గుజ్జు
  • జీవిలి : చెవిలోని మలినం
  • జోకు : తూకం
  • తాంబాళం : పెద్ద పళ్ళెం
  • నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట
  • నెరి : పూర్తిగా
  • బీరిపోవు : ఆశ్చర్యపడు
  • మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం
  • వొయ్య : పుస్తకం
  • సోయి : స్పృహ
  • బిశాది : విలువ
  • పతార : పలుకుబడి
  • పజీత : పరువు
  • సాపిచ్చుట : తిట్టుట
  • పస్కలు : కామెర్లు
  • గౌర : గరాటు
  • గాసం : దాన
  • బల్గం : బంధుజనం
  • సొరికి : సొరంగం
  • సౌలతు : వసతి
  • బోలెడు : చాల
  • ఓపాలి : ఓసారి
  • యాల్ల : సమయం
  • కారటు : ఉత్తరం
  • డోకు : వాంతి
  • టప్పా : పోస్టు
  • సూటి : గురి
  • సోల్తి : జాడ
  • సోపతి : స్నేహం
  • ఎర్కలే : జ్ఞాపకం లేదు
  • ఉత్తగ : ఊరికే
  • నువద్ది : నిజంగా
  • పైలం : జాగ్రత్త
  • శరం : సిగ్గు
  • ఛిద్రం : రంధ్రం
  • మతలబు : విషయం
  • ఎండ్రికాయ : పీత
  • జబర్‌దస్తీ : బలవంతం
  • కనరు : వెగటు
  • ఇడిసిపెట్టు : వదిలిపెట్టు
  • గత్తర : కలరా
  • ఇగురం : వివరం
  • పరదా : తెర
  • గుర్రు పెట్టుట : గురక పెట్టుట
  • గులగుల : దురద
  • గులాం : బానిస
  • గిచ్చుట : గిల్లుట
  • పిసరంత : కొద్దిగా
  • గుత్త : మొత్తం ఒకేసారి
  • గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
  • శిట్టశిట్ట : తొందరగా
  • బర్ఖతక్కువ : వృద్దిలేని
  • వుర్కు : పరుగెత్తు
  • సర్రున : వెంటనే
  • మొస : శ్వాస
  • బుదగరింపు : ఓదార్పు
  • ఓమానంగా : అతి కష్టంగా
  • గల్మ : ద్వారం
  • పొల్ల : అమ్మాయి
  • ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది
  • ఇషారా : వివరాలు
  • కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
  • దూప : దాహం
  • తొవ్వ : దారి
  • లగ్గం : పెళ్ళి
  • సోయి : స్పృహ
  • ఏసిడి : చెడుకాలం
  • జరంత : కొద్దిగా
  • పైలం : పదిలం
  • యాదుందా : జ్ఞాపకం ఉందా
  • ఎక్కిరింత : వెక్కిరించుట
  • సవుసు : ఆగు
  • చితల్‌పండు : సీతాఫలం
  • కాలం చేసుడు : మరణించుట
  • మస్తుగ : మంచిగ
  • నిరుడు : గత సంవత్సరం
  • ఎర్కలే : జ్ఞాపకం లేదు
  • పోవట్టిన : వెళ్తున్న
  • కూకొ : కూర్చో
  • పొద్మికి : సాయంత్రం
  • ఉత్తగ : ఊరకే
  • బుదగరిచ్చి : బతిలాడి
  • యాష్ట : విసుగు
  • తెగదెంపులు : విడాకులు
  • సాయిత : దంట
  • లొల్లి : గోల
  • పాయిద : లాభం
  • తోడెం : కొంచెం
  • భేట్ : కలయిక
  • కీలు : తాళం
  • జల్ది : త్వరగా
  • ఫకత్ : ఎల్లప్పుడు
  • పంఖా : విసనకర్ర
  • గూసలాట : పొట్లాటా
  • ఝగడ్ : జగడం
  • నిత్తె : ప్రతి దినం
  • గాయి : అల్లరి
  • సెక : మంట
  • మస్కున : మసక చీకటిలో
  • తోగరుపప్పు : కందిపప్పు
  • అయి : అమ్మ
  • గాడికా : అక్కడికా
  • లెంకుట : వెదుకుట
  • పక్కా : నిశ్చయము
  • ఉంది : వరకట్నం
  • లాగు : నెక్కరు
  • బుడ్డోడు : చిన్నవాడు
  • మెత్త : దిండు
  • అడ్డెనిగా : భోజన స్లాండు
  • పదిలెము : క్షేమం
  • సర్వపిండి : కారం రొట్టె
  • బొక్కెన : నీరుతోడే బక్కెట్
  • వొర్రకు : అరువకు
  • గౌసెను : దిండు కవరు
  • కైకిలి : కూలీ
  • చెల్క : వర్షధార పొలం
  • గౌడి : కోట
  • ముల్లె : మూట
  • దర్వాజ : తలుపు
  • కొట్టము : గోశాల
  • తనాబ్బి : షెల్పు
  • ముంత : చెంబు
  • ఉరుకు : పరుగెత్తు
  • ఆత్రము : తొందర
  • సౌసు : ఆగు
  • శిబ్బి : అన్నం వంపే మూత
  • తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది
  • లగ్గం : పెండ్లి
  • నాగెల్లి : నాగవెల్లి
  • పైలము : జాగ్రత్త
  • దౌతి : సిరాబుడ్డి
  • ఎగిర్త : తొందర
  • అడ్లు : వరిధాన్యం
  • పుస్తె : తాళి
  • నొసలు : లలాటము
  • తోల్త : పంపిస్త
  • బాట : దారి
  • లెంకు : వెతుకు
  • మంకు : బుద్ధిమాంద్యం
  • పత్త : చిరునామా
  • ఇకమత్ : తెల్వి
  • తకరారు : సతాయించుడు
  • తోడం : కొంచెం
  • పడిశం : సర్ధి
  • బలుపు : మదము
  • కండువ : టవల్
  • అంగి : చొక్కా
  • బౌగొనె : గిన్నె
  • బువ్వ : అన్నం
  • ఎయ్యి : పెట్టు
  • ఎక్క : దీపం
  • గూడు : సెల్ఫ్
  • నెత్తి : తల
  • వర్రుడు : బాగా మాట్లాడు
  • ఉరికిరా : పరిగెత్తుకుని రా
  • మాలెసా : బాగా
  • మడిగెలు : షెట్టర్లు
  • నూకు : వుడ్చుడు
  • ఉబ్బర : ఉక్కపోత
  • యాడికి : ఎక్కడికి
  • కుకొ : కూర్చుండు
  • జర ఆగు : కొద్దిగుండు
  • కంకలు : ఎడ్లు
  • మొగులు : ఆకాశం
  • నెత్తి : తల
  • ఇకమతు : ఉపాయం
  • మలగడం : తిరగడం
  • దబ్బన : తొందర
  • మారాజ్ : పూజారి
  • లడిక : గరాటు
  • శారాన : పావుల
  • బారాన : మూడు పావులాలు
  • కుర్స : పొట్టి
  • మోటు : గడుసు
  • గోసి : పంచ
  • బాపు : తండ్రి
  • కాక : బాబాయి
  • పెదబాపు : పెద్ద నాన్న
  • పెద్దాయి : పెద్దమ్మ
  • యారాలు : తోటి కోడలు
  • సడ్డకుడు : తోడల్లుడు
  • సాలెగాడు : బావమర్ది
  • తమ్మి : తమ్ముడు
  • దన్ననరా : త్వరగా రా
  • జల్దిరా : జెప్పున రా
  • ఊకో : ఆగు
  • సోపాల : ఒడి
  • ఓమాడి : పొదుపు
  • పురాత : పూర్తిగా
  • పైలంగరా : మెల్లగ రా
  • ఆడికేంచి : అక్కడి నుండి
  • లగు : బలుపు
  • పరేషాన్ : అలసట
  • ఇమ్మతి : సాయం
  • ఇమాకత్ : గర్వం
  • జాతర : తీర్ధం
  • పనుగడి : కొష్టం దరువాజ
  • సిడీలు : మెట్లు
  • తట్టి : పళ్ళెం
  • ఊరబిస్క : ఊరపిచ్చుక
  • ఆవలికి : బయటకు
  • పాయిరం : పావురం
  • ఆయేటిబూనంగ : తొలకరి
  • సడుగు : రోడ్డు
  • దొరింపు : మార్గం
  • కుందాపన : దిగులు
  • పిడుస : ముద్ద
  • దుబ్బ : మట్టి
  • చెండు : బంతి
  • బగ్గ : బాగా
  • బొచ్చెడు : చాలా
  • యాపాకులు : వేపాకులు
  • గాయిదోడు : ఆవారా
  • నడిమిట్ల : మధ్యన
  • సూరు : చూరు
  • పయ్య : చక్రం
  • ఒంటేలు : మూత్రం
  • రాతెండి : అల్యూమినియం
  • బర్మా : రంధ్రాలు చేసే సాధనం
  • ఇగురం : ఉపాయం
  • దిడ్డి : కిటికీ
  • ఇల వరుస : పద్ధతి
  • బుట్టాలు : లోలాకులు
  • గరిమి : వేడి
  • కచ్చురం : ఎడ్ల బండి
  • పెనిమిటి : భర్త
  • అర్ర : గది
  • గలుమ : తలుపు
  • తల్వాలు : తలంబ్రాలు
  • పరాశికం : నవ్వులాట
  • మబ్బుల : వేకువ జామున
  • చిడిమెల : తొందరగా
  • కాపాయం : పొదుపు
  • యవ్వారం : వ్యవహారం
  • కైకిలి : కూలి
  • అలిమిబలిమి : ఇష్టాయిష్టాలు
  • మనాది : బెంగ
  • ఎటమటం : బెడిసికొట్టు
  • మొగులు : ఆకాశం
  • రంది : దిగులు
  • సడుగు : తొవ్వ
  • బాలకాలి : పిల్ల చేష్టలు
  • అగ్వ : చౌక
  • గాడ్పు : గాలి
  • ఇంగలం : నిప్పు
  • మాల్‌గాడి : గూడ్సు బండి
  • ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు
  • గిర్వి : తాకట్టు
  • కొలువు : నౌకరు
  • పాలోళ్ళు : దాయాదులు
  • పొద్దుగూకి : సాయంత్రం
  • నెత్తి : తల
  • జంగుబట్టింది : తుప్పుబట్టింది
  • మొగురం : కట్టెస్తంభం
  • గావురం : ప్రేమ
  • ఒద్దులు : దినములు
  • గలుమ : ద్వారము
  • లగాంచి : జోరుగా
  • రికాం : తీరిక
  • సుంసాం : నిశ్శబ్దం
  • తట్టు : గోనె సంచి
  • గత్తర : కలరా
  • తొట్టె : ఊయల
  • ఇగం : అతి చల్లని
  • గవాబు : సాక్ష్యం
  • తాపతాపకు : మాటిమాటికి
  • పైకం : డబ్బులు
  • తపుకు : మూత గిన్నె
  • బుగులు : భయం
  • సుతారం : సున్నితం
  • తోలుట : నడుపుట
  • కోల్యాగ : ఆవుదూడ
  • సొక్కంపూస : నీతిమంతుడు
  • బుదగరించుట : బుజ్జగించుట
  • బరివాత : నగ్నంగ
  • కోసులు : మైళ్ళు
  • తనాబ్బి : కప్ బోర్డు
  • వరపూజ : నిశ్చితార్థం
  • రయికె : జాకెట్టు
  • తనాబి : షెల్ఫ్
  • తంతెలు : మెట్లు
  • ఆనక్కాయ : సొరకాయ
  • కలెగూర : తోటకూర
  • తొక్కు : ఊరగాయ
  • బుక్కెడు : ఒక ముద్ద
  • గంటే : గరిటే
  • గరిమికోటు : రెయిన్ కోటు
  • గంజు : వంట పాత్ర
  • రంజన్ : కూజ
  • నూతి : బావి
  • గడెంచే : నులకమంచం
  • అవతల : ఆరు బయట
  • గొడిసేపు : కాసేపు
  • నిరుడు యేడు : గత సంవత్సరం
  • కల్ప : మంగలి పెట్టే
  • టొక్క : పారిపోవడం
  • పత్తి : పాళీ
  • కందిలి : చిన్న దీపం
  • సోల్తి : జాడ
  • పొంతన : పోలిక
  • మోపున : జాగ్రత్తగ
  • పోగులు : కుప్పలు
  • ఎటమటం : పొరపాటు
  • సర్సుట : కొట్టుట
  • కాన్గి బడి : ప్రైవేటు బడి
  • లగ్గం : పెళ్ళి
  • మార్లబడుట : తిరగబడుట
  • తాషిలి : కీడు
  • కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
  • దడ్లబురి : మగ కోతి
  • మొస : అధిక శ్వాస
  • డొక్క : కడుపు
  • అముడాల : కవల
  • ఆపతి పడుట : ప్రసవ వేదన
  • ఇగం : చల్లగ, హిమం
  • ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం
  • ఇమానం : ప్రమాణం
  • ఎనుగు : ముండ్ల కంచె
  • ఏతులు : హెచ్చులు, గొప్పలు
  • బగరుకొట్టుట : వేగంగా శ్వాసించుట
  • కంచె : గడ్డి బీడు
  • కైలాట్కం : కలహం, కొట్లాట
  • జిట్టి : దృష్టి
  • జిమ్మ : జిహ్వ
  • తుత్తుర్లు : వెంట్రుకలు
  • దంచుట : దండించుట, కొట్టుట
  • దంగుట : తఱుగుట
  • నీయత్ : నిజాయితీ
  • పాసంగం : మొగ్గు
  • పురుసత్ : విశ్రాంతి
  • మిత్తి : వడ్డి
  • ఆయిటి : తొలకరి
  • ఇగురు : చిగురు
  • ఇగురం : వ్యూహం
  • ఇగ్గుట : సంకోచించుట
  • ఇచ్చంత్రం : విచిత్రం
  • ఒళ్ళక్కం : అబద్దం
  • కువారం : చెడ్డబుద్ధి
  • కైగట్టుట : కవిత్వం రాయుట
  • దసుకుట : కుంగుట
  • నక్కు : అతుకు
  • నాదాను : బలహీనం
  • నేఱివడుట : అలసిపోవుట
  • పతార : పరపతి
  • పుల్లసీలుట : అలసిపోవుట
  • బొండిగ : గొంతు
  • మాల్యం : దయ గలుగుట
  • మాయిల్యమే : వెంటనే, తొందరగ
  • మోర్‌దోపు : ప్రమాదకరమైన
  • తొవ్వ : బాట
  • మంకు : మొండితనం
  • నొసలు : నుదురు
  • దొబ్బు : నెట్టు
  • దీపంత : ప్రమిద
  • కాయిసు : ఇష్టం
  • యాల్ల : సమయం
  • రౌతు : రాయి
  • పసిరికెలు : కామెర్లు
  • పటువ : కుండ
  • ఉబ్బు : ఉత్సాహం
  • పెయ్యి : వొళ్ళు
  • యాష్ట : విసుగు
  • అంబటియాల : అంటి తాగే సమయం
  • ఆనగపు కాయ : సోరకాయ
  • ఇసుర్రాయి : విసురు రాయి
  • ఉలువచారు : ఉలువ కట్టు
  • ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు
  • ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
  • ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి
  • కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ
  • గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది.
  • గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది.
  • వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు).
  • కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ.
  • సాయబాన్ : దంపతుల పడకగది.
  • సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు.
  • గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది.
  • కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ.
  • గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు.
  • ఇకమత్ : ఉపాయం
  • మిడుకుడు : ఈర్శ
  • గడ్డపార : మొగులు
  • శిర్రగోనె : గూటి బిల్ల
  • సాన్పి : కళ్ళాపి
  • పొద్మీకి : సాయంకాలం
  • బుగ్గ : బల్బు
  • పైలు : ఒకటో తేది
  • బెస్తారం : గురువారం
  • ఐతారం : ఆదివారం
  • బిరాన : తొందరగా
  • మలాస : ఎక్కువ
  • పైలం : జాగ్రత్త
  • ఏంటికి : ఎందుకు
  • గులగుల : చెక్కిలిగింతలు
  • అంగి : చొక్కా
  • నడ్మ : మధ్యలో
  • ఆల్చం : లేటు
  • అసంతకు : పక్కకు
  • సైసు : ఆగు
  • అద్దాలు : కళ్ళజోడు
  • అట్లనా : అవునా
  • ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు
  • తియ్యి : తీయు
  • శాతాడు : చేతాడు
  • పోతడు : వెళ్ళగలడు
  • అస్తడు : వస్తాడు
  • మొగురం : ఇంటిలో స్తంభం
  • ఆసం : పైకప్పు కర్ర
  • నడ్డి : నడుము
  • చెడ్డి : డ్రాయరు
  • ఎడ్డి : తెల్విలేని తనం
  • దుడ్లు : పైసలు
  • అడ్లు : వరి ధాన్యం
  • మడి : భూమి గుంట
  • పుస్తె : తాళి
  • గుత్త : ఒక్క మొకాన
  • సగురం : కొప్పుకు జతపరిచేది
  • అందాద : సుమారు
  • ఆయిల్ల : క్రితం రాత్రి
  • కడ్డు : మొండి
  • నసీవ : అదృష్టం
  • ఎగిర్తం : తొందర
  • ఎచ్చిరికం : అతి
  • బరివాత : నగ్నం
  • అర్ర : స్టోర్ రూమ్
  • నిరుడు : క్రితం సంవత్సరం
  • సై చూడు : రుచి చూడు
  • ఇమానం : ఒట్టు
  • పైలం : జాగ్రత్త
  • పెయిసబ్బు : స్నానం సబ్బు
  • కుత్తెం : ఇరుకు
  • బల్లిపాతర : బూజు
  • బుక్కుట : తినుట
  • తుట్టి : నష్టం
  • ఓరకు పెట్టుట : దాచి పెట్టుట
  • తట్టి : పళ్లెం
  • మత్తి : పొగరు
  • ఎకసెక్కాలు : పరాష్కాలు
  • ఇకిలించుట : నవ్వుట
  • గలుమ : గడప
  • కాకిరి బీకిరి : గజిబిజి
  • బుజ్జగించి : లాలించి
  • ప్రభోజనం : ఫంక్షన్
  • గుత్పలు : పెద్ద కర్రలు
  • దుడ్లు : డబ్బులు
  • పజీత : సతాయించడం
  • మెడకొడం : వెంబడి తగలడం
  • లెంకుట : వెతుకుట
  • ఊకుట : ఊడ్వడం
  • లాగం : అలవాటు
  • ఉల్లెక్కాలు : పరిహాసం
  • బరివాతల : దిగంబరంగా
  • శవ్వా : చీచీ
  • లగ్గం : పెళ్ళి
  • పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు
  • కార్జం : మేక కాలెయం
  • సోల్‌పూత : వరుసగా
  • ఉల్లుల్లు : వదులుగా చేయుట
  • డల్లు : కొద్దిసేపు
  • లాలపోయుట : స్నానం పోయుట
  • సల్లు : నీరు కారుట
  • పాసంగం : బరువులో తేడా
  • గతుకులు : ఎగుడు దిగుడు
  • గడ్కోటి : గడియకోసారి
  • దస్కుట : కుంగిపోవుట
  • పొతం : చక్కగా అమర్చడం
  • సనుగు : ఒక వస్తువు
  • దొరింపు : సమకూర్చుట
  • సుమీ : హెచ్చరిక చేయడం
  • నివద్దే : నిజమే
  • కీస్ పిట్ట : విజిల్
  • పీక : బూర
  • చెండు : బంతి
  • పుడా : ప్యాకెట్
  • రికాం : తీరిక
  • సలువలు : చెమటలు
  • మాడ : తలపై భాగం
  • ఒంటేలు : మూత్రం
  • గొట్టు : కఠినమైన
  • బర్ర : గాయపు మచ్చ
  • పులగండు : తిండిబోతు
  • అగడు : అత్యాశ
  • మార్వానం : రెండో పెళ్ళి
  • చిలుము : తుప్పు
  • పుర్సత్ : నిమ్మలం
  • పిసరు : చిన్నముక్క
  • పిడాత : అకస్మాత్తుగా
  • తెరువకు : జోలికి
  • యాట : గొర్రె/మేక
  • మొగురం : కర్ర స్తంభం
  • ఇసురుగ : గొప్పగా
  • సిన్నగా : మెల్లగా
  • రంది : బాధ
  • పసిది : చిన్నది
  • బోళ్ళు : గిన్నెలు
  • ఇడుపు : విడాకులు
  • కారటు : ఉత్తరం
  • పొద్దుగాల : వేకువ జామున
  • అగ్గువ : చౌక
  • బయాన : అడ్వాన్సు
  • మడిగె : దుకాణం
  • బీమారి : రోగం
  • సోల : కిలో
  • సంత : అంగడి
  • ఇనాం : బహుమతి
  • తలె : పళ్ళెం
  • పత్తాలాట : పేకాట
  • ముచ్చెట్లు : మాటలు
  • అక్కెర : అవసరం
  • ఏశాలు : నాటకాలు
  • కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం
  • కమిలింది : కందిపోయింది
  • గద్దరించు : గట్టిగా అరుచు
  • గట్లనే : అట్లాగే
  • గతిమెల్ల : దిక్కులేని
  • గత్తర : కలరా
  • గర్క : గరిక
  • గాయింత పని : మిగిలిన పని
  • గంతే : అంతే
  • గుత్తేదారు : కాంట్రాక్టరు
  • గుత్ప : దుడ్డుకర్ర
  • గొర్రెంక : గోరువంక
  • గోలం : నీళ్ల తొట్టి
  • తిత్తి : తోలు సంచి
  • తువాల : తుండు గుడ్డ
  • తత్తర : తడబడు