Document and Learn.

అత్రగాలం


జల్లించటం , వడ కట్టడం


మా అవ్వ జొన్నపిండి "అత్రగాలం" పడుతాంది...




By Raghu on Oct 08 2021

అవ్వ బువ్వ కాడు


ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికేవాడు.


వాడు ఇంకా అవ్వ "బువ్వ" కాడే గాదే అక్క..




By Raghu on Oct 08 2021

ఆదికి ముందు


తొందర పది ముందుగా చేస్తే ఈ పదం వాడుతారు


ఉత్తరాంధ్ర / విజయనగరం గ్రామీణం

ఆదికి ముందు గాభరా పడకురా!

ఇంకా అరటి తోట పూర్తిగా బేరమే అవ్వలేదు .. ఈడెల్లి ఆదికిముందు అరెకరం తోట గెలలు దించెండట !




By Eswar on Sep 22 2021

ఆముడాలపిల్లలు


తెలంగాణ యాసలో ఆముడాలపిల్లలు అంటే కవలపిల్లలు అని అర్థం.


మా పెద్దక్కకు ఇద్దరు "ఆముడాలపిల్లలే" పుట్టిన్రు




By Raghu on Oct 08 2021

ఆయిల్ల


రాత్రి


నిన్న ఆయిల్ల మా సిన్నక్క వచ్చింది..




By Raghu on Oct 08 2021