kurnoolu

కర్నూలు: రాయలసీమ ముఖద్వారం — సుస్వరాల సీమ

కవిత్వం – భాషోచ్చారణ

తెలుగు కవిత్వం ఎక్కడ పుట్టిందీ? అంటే గోదావరి, కృష్ణా తీరాలనే సమాధానం రావచ్చు.
కానీ భాషోచ్చారణ సువ్యవస్థిత రూపంలో పుట్టింది మాత్రం కర్నూలు జిల్లాలోనంటే అతిశయంగా అనిపించినా, ఆ మాటకు బలం ఉంది.

జానపదుల నోటి నుంచే కవిత్వం నాగరిక ఛందోరూపాలకు పరివర్తితమైందన్నది సత్యమైతే, తెలుగునాట అన్ని తీరాల్లోనూ అనాదికాలంలోనే కవిత్వం పుట్టింది.
అయితే శిలాలిపి, శాసన లిపి, కావ్యభాష — అత్యధికంగా కృష్ణా–గోదావరి తీరాల్లోనూ, తూర్పు తీరాల్లోనూ వెలుగొందాయి.


సువ్యవస్థిత ఉచ్చారణ: కర్నూలు ప్రత్యేకత

పదాన్ని ఉన్నది ఉన్నట్లుగా పలకడం — ఇదే సువ్యవస్థిత ఉచ్చారణ.
ఈ లక్షణానికి కర్నూలు జిల్లా ప్రజల మాటతీరు ఉదాహరణ.

పత్రికలు, సినిమాలు, దూరదర్శన్‌లలో వినిపించే ప్రామాణిక తెలుగు — మూలంగా ఈ జిల్లాదే.
క్రియాపదాల రూపాల్లో స్వల్ప మార్పులుంటాయి గానీ, ఉచ్చారణ స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది.

స్థిరోచ్చారణ కనిపించే ప్రాంతాలు

  • నంద్యాల
  • ఆళ్లగడ్డ
  • కోవెలకుంట్ల
  • ఆత్మకూరు
  • చాగలమర్రి
  • అవుకు
  • కొలిమిగుండ్ల
  • అహోబిలం
  • శ్రీశైలం

అక్కడ కాస్త విభిన్నంగా…

కర్నూలు తూర్పు ప్రాంతంలోని కొన్ని గ్రామాలు, పశ్చిమోత్తర ప్రాంతాలు, నందికొట్కూరు తాలూకా మాండలికం కాస్త భిన్నంగా ఉంటుంది.

ఉదాహరణలు

ఇలాంటి రూపాల్లో నాన్పుడు యాస, కనపడీ కనపడని దీర్ఘం వినిపిస్తుంది.


ప్రాంతీయ ప్రభావాలు

  • ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, కోసిగి, దేవనకొండ → కన్నడ ప్రభావం
  • బనగానపల్లె తాలూకా నందవరం, నందివర్గం, సంజామల → స్థిరోచ్చారణ
  • నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, అహోబిలం, శ్రీశైలం, రుద్రవరం → యథార్థ ఉచ్చారణ

క్రియారూపాలు

  • వచ్చి నాడు
  • తినినాడు
  • రాసినాడు
  • వస్తున్నాడు
  • వస్తున్నది

కొన్ని చోట్ల:

  • వచ్చినడు
  • తినినడు
  • రాసిండు
  • వచ్చిండు

అయితే యాస, దీర్ఘాలు స్పష్టంగా వినిపించవు.


పరిణామ క్రియారూపాలు

పల్లెజనం మాటల్లో స్వరూపం మారుతుంది గానీ స్వరం మారదు.


మిశ్రతలేని పలుకు

  • “పాప ఇంట్లో ఉన్నది”
  • “పాపే ఇంట్లో ఉన్నదా!”

ఇక్కడ దీర్ఘాలు, మిశ్రస్వరాలు లేవు.

ఇంకా:


కర్నూలు మాండలిక విభాగాలు

మూడు ప్రధాన మాండలికాలు కనిపిస్తాయి:

  1. మధ్య ప్రాంత మాండలికం
  2. తూర్పు ప్రాంత మాండలికం
  3. పశ్చిమోత్తర ప్రాంత మాండలికం

పత్రికల భాష, కర్నూలు ప్రజల భాష — ఇంచుమించు ఒకటే.


అచ్చమైన తెలుగు పదాల మూట

అడ్వాన్సుకు సమానార్థకాలు

మునిగా → ముందుగానే ఇచ్చే గుత్త

గుత్త (వ్యవసాయ పదం)

పొలాన్ని మరొకరికి పంటలో వాటాగా ఇవ్వడం — గుత్తకివ్వడం
కారుకు ఇచ్చే ధాన్య బస్తాలు → గుత్త


పదసంపద (ఉదాహరణలు)